ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో సూపర్ ఫార్మ్ లోకి వచ్చాడు. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన మళ్ళీ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఆ సినిమా తరువాత యంగ్ స్టర్స్ తో హ్యాపీ డేస్ తరహా మూవీ స్టార్ట్ చేశారు. కారణాలేమైనా ఆ మూవీ మధ్యలో ఆగిపోయింది. ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' చిత్రాన్ని చేస్తున్నాడు. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ నారాయణ దాస్ నారంగ్ నిర్మిస్తున్నారు. దీని తర్వాత కూడా తన తదుపరి చిత్రాన్ని శేఖర్ కమ్ముల ఈ నిర్మాతకే చేయనున్నాడట. అందులో ఓ పెద్ద హీరో నటిస్తాడనీ, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa