ఫిబ్రవరి 14న ‘నా పేరు సూర్య' సినిమాలోని రెండో పాట ‘లవర్ ఆల్సో ... ఫైటర్ ఆల్సో' ను విడుదల చేస్తున్నట్లు అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, విశాల్ శేఖర్ సంగీతమందించారు.‘లవర్ ఆల్సో ... ఫైటర్ ఆల్సో' పాటను అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూయేల్‌పై చిత్రీకరించారు. సినిమాలో ఈ లవ్ సాంగ్ హైలెట్ కానుంది. ఈ పాట నాకు ఎంతో నచ్చింది, మీరూ ఈ పాటతో కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను అని అల్లు అర్జున్ తెలిపారు.గణతంత్ర దినోత్సవం సందర్బంగా ‘నా పేరు సూర్య' పాటను విడుదల చేయగా దానికి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది.ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో కనిపించబోతున్న బన్నీ గతంలో ఏ సినిమాకు చేయనంతగా హార్డ్ వర్క్ చేశాడు. బన్నీ కెరీర్లోనే ఈ చిత్రం ఓ స్పెషల్ మూవీగా కాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు చూడని మిలటరీ ట్రైనింగ్ బ్యాక్‌డ్రాపుతో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa