బాలీవుడ్ అందాల నటి అనుష్క శర్మ నిర్మాతగా మారి రూపొందించిన వెబ్ సిరీస్ పాతాళ్ లోక్‌కు మంచి ప్రేక్షకదారణ లభించింది.ఈ వెబ్ సిరీస్ విమర్శకులను సైతం ఆకట్టుకోవడం, మంచి రివ్యూలు రావడంతో యూనిట్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఈ ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సక్సెస్ పార్టీని నిబంధనలుకు లోబడి ఏర్పాటు చేసుకొన్నారు.ఈ వెబ్ సిరీస్ పలువురి ప్రశంసలను పొందింది. ఇదే సమయంలో విమర్శలను కూడా మూటగట్టుకుంది. ఈ సిరీస్ పై మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. 'ది ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్' సభ్యులు ఈ ఫిర్యాదు చేశారు.తమ గూర్ఖా సమాజాన్ని అవమానకరంగా చిత్రీకరించారని ఫిర్యాదులో ఆరోపించారు. రెండో ఎపిసోడ్ లో తమను కించపరిచే విధంగా ఒక సన్నివేశాన్ని చిత్రీకరించారని తెలిపారు. ఆ సీన్ లో వచ్చే డైలాగ్స్ వినపడకుండా మ్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అనుష్కశర్మకు గూర్ఖా సమాజానికి చెందిన కొన్ని వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. అనుష్కపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా పోరాడతామని తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa