పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాక్సర్ గా విజయ్ నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కథానాయిక కాగా రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ముంబై లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణం గా నిలిచిపోయింది.ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మార్షల్ ఆర్ట్స్ ప్రధానాంశంగా తెరకెక్కుతోంది.తాజాగా ఛార్మి మాట్లాడుతూ, ఈ సినిమాకు మంచి టైటిల్ ను ఫిక్స్ చేస్తామని తెలిపారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఇండియాలో టాప్ 3 హీరోయిన్స్ లో ఒకరిగా అనన్య ఉంటుందని చెెప్పారు. అనన్యలో మంచి టాలెంట్ ఉందని తెలిపారు. విజయ్ సెట్స్ లో ఉంటే హాయిగా ఉంటుందని, టెన్షన్స్ ఉండవని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa