లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా సినీ పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోవడంతో పాటు వేలాది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో, అగ్రనటుడు చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమకు మేలు కలిగించే నిర్ణయాలతో పాటు సింగిల్ విండో అనుమతుల జీవో విడుదల చేసినందకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తరుపున ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్‌లో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... లాక్‌డౌన్ తర్వాత పరిశ్రమ సమస్యలపై చర్చించేందకు తనను కలవమని ఏసీ సీఎం జగన్ తనతో చెప్పినట్టు చిరంజీవి ట్వీట్ చేసారు. త్వరలో చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాలకు సంబంధించిన వారితో ఏపీ సీఎం జగన్‌తో చర్చించనట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa