RX 100 సినిమాతో యూత్‌లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కార్తికేయ తాజాగా అల్లు అరవింద్ సమర్ఫణలో గీతా ఆర్ట్స్ 2 బ్యాన్‌లో కొత్త సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాకు ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాతో కౌశిక్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు.కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా 'చావు కబురు చల్లగా' చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయినా చిత్ర దర్శకుడు కౌశిక్ మాత్రం ఈ సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాడట. ఆన్ లైన్లో హీరో హీరోయిన్లకు స్క్రిప్టు చదివి వినిపిస్తూ, కొన్ని సీన్లు ముందుగానే ప్రాక్టీస్ చేయిస్తున్నాడట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa