పెళ్ళి చూపులు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో అందరి దృష్టి ఆకర్షించాడు. ఈ సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ ప్రస్తుతం రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్ . దుమ్ము లేపుకుంటూ వెళుతున్న కారు ఫోటోని షేర్ చేస్తూ ఫస్ట్ లుక్ త్వరలోనే రానుందని ప్రకటించారు. టాక్సీవాలా అనే టైటిల్‌తో ఈ మూవీ ప్రచారం జరుపుకుంటుండగా, జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ బేనర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాక్సీ డ్రైవర్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుందని తెలుస్తుంది. చిత్రంలో షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు.
It's time.
I am back. pic.twitter.com/2jQMmMr926
— Vijay Deverakonda (@TheDeverakonda) February 9, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa