రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగస్థలం. మార్చి 30న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇటీవల రామ్ చరణ్ పాత్రకి సంబంధించి టీజర్ విడుదల చేశారు. ఇందులో ఆయ్.. నాపేరు చిట్టిబాబు అండీ.. ఈ ఊరికి మనమే ఇంజనీర్.. అందరికీ సౌండ్ వినపడుద్దండీ.. నాకు సౌండ్ కనపడుద్దండీ..’ అంటూ గోదావరి యాసలో చిట్టి బాబు రీ సౌండ్ వచ్చేలా చేశాడు. ఇక తాజాగా రామలక్ష్మి పాత్ర చేస్తున్న సమంతకి సంబంధించిన టీజర్ విడుదల అయింది. ఈ పిల్లెదురు వస్తుంటే మా ఊరికి 18సం. వయస్సు వచ్చినట్టుంటదండి.. ఈ చిట్టిగాడి గుండెకాయని గోలెట్టించింది రామలక్ష్మేనండి అంటూ చరణ్ బ్యాక్ గ్రౌండ్‌లో చెబుతుండగా, ఎంతో ఇంప్రెసివ్‌గా ఉన్న లుక్స్ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకు సమంతకి సంబంధించి ఒక్క లుక్ కూడా బయటకి రాకపోవడంతో ఈ టీజర్ అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఫిబ్రవరి 13 సాయంత్రం 5గం.లకు చిత్రానికి సంబంధించి తొలిపాట విడుదల కానుంది. 1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా ‘రంగస్థలం’ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. జగపతిబాబు, ఆది, అనసూయ ఈ మూవీలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎరినేని, రవిశంకర్ ఎరినేని, మోహన్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa