ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదు : అమృత మామ బాలస్వామి...

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 05:41 PM

ఎప్పుడూ వివాదాలతో సహజీవనం చేసే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... 'మర్డర్' సినిమా ప్రకటనతో మరో వివాదానికి తెరతీశారు. పరువు హత్య కథనంతో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రం అమృత, ప్రణయ్, మారుతీరావుల కథేనని  ప్రచారం జరుగుతోంది. దీంతో, వర్మపై అమృత తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. పోస్టర్ చూడగానే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని ఆమె అన్నట్టు కథనాలు వచ్చాయి. అమృత వ్యాఖ్యలకు వర్మ కూడా సమాధానం చెప్పారు. ఈ సినిమా వాస్తవ గాథ ఆధారంగా రూపొందుతుందని చెప్పానే కాని... నిజమైన స్టోరీ అని చెప్పలేదని అన్నారు.


మరోవైపు ఈ అంశంపై అమృత మామగారు బాలస్వామి స్పందించారు. అమృత పేరిట సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని ఆయన చెప్పారు. వర్మ సినిమాపై అమృత స్పందించలేదని అన్నారు. ఆమె పేరుపై వస్తున్న స్టేట్మెంట్లను నమ్మొద్దని కోరారు.


మరోవైపు, ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించనున్నారు. రామ్ గోపాల్ వర్మ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు నట్టి క్రాంతి, నట్టి రుణ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa