'మారుతి రాసిన అమృతప్రణయ గాథ' అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లు విడుదల చేసిన వర్మ ఈ రోజు ఈ సినిమాలోని మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేపేలా వర్మ పోస్టర్లు విడుదల చేస్తున్నారు.
ఈ పోస్టర్‌లో అమృత తన కుమారుడిని ఎత్తుకుని ఉన్నట్లు ఉంది. ప్రణయ్ పరువు హత్యకు గురికావడం, అమృత తండ్రి ఆత్మహత్య చేసుకోవడం వంటి సన్నివేశాలతో యాథార్థగాథ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు వర్మ తెలిపిన విషయం తెలిసిందే. ప్రయణ్ చనిపోయిన తర్వాత అమృతకు మగబిడ్డ పుట్టాడు.
Am overwhelmed with the emotional intensity portrayed by @AvanchaSahithi in this pic from MURDER #LoveCanMURDER pic.twitter.com/AZvhM4EyaC
— Ram Gopal Varma (@RGVzoomin) June 26, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa