ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న అల్లరి నరేష్ చడీ చప్పుడు కాకుండా ఓ సినిమా పూర్తి చేసుకున్నాడు. తన 57వ చిత్రంగా 'నాంది' అనే సినిమాలో నటించాడు. అల్లరి నరేష్ అంటేనే హాస్యం ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే నరేష్ ఈసారి విభిన్నంగా ఈ సినిమాలో దర్శనం ఇస్తున్నట్టు తెలుస్తోంది. జూన్ 30న తన బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర పోస్టర్‌ను తన ట్విటర్‌లో పంచుకున్నాడు. పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా కూర్చున్న పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేశాడు. 'నాంది' ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్) పేరట గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు తెలిపాడు.
'జూన్ 30 మంగళవారం - మీరందరూ 'నాంది' సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయడానికి సాక్ష్యంగా నిలవండి' అంటూ నరేష్ పేర్కొన్నాడు. చూడాలి మరి రూటు మార్చిన నరేష్‌కు ఈ సినిమా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో. కాగా, ఈ చిత్రంతో హరీష్ శంకర్ దగ్గర కో-డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈచిత్రానికి అబ్బూరి రవి, చోటా కె. ప్రసాద్, శ్రీచరణ్ పాకాల, బ్రహ్మ కడలి వంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రియదర్శి, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa