ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. దేశం ఎదుర్కొంటున్న సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ .. బిజినెస్ మ్యాన్ నుంచి రాజకీయ నాయకుడి ఎందుకు మారాడనే నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అసలు ఒక వ్యాపారవేత్త ఎందుకు పొలిటిషన్ కావాల్సి వచ్చిందో ఈసినిమా స్టోరీ. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌తో పోస్టర్లను కూడా రెడీ చేసి రిలీజ్ చేసారు ఎన్టీఆర్ అభిమానులు. 'అరవింద సమేత వీర రాఘవ' తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ .. బిజినెస్ మ్యాన్ నుంచి రాజకీయ నాయకుడు ఎందుకు మారాడనే నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా బడ్జెట్‌లో భారీ కోత విధించినట్టు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్‌తో పాటు త్రివిక్రమ్ తమ పారితోషకంలో 30 శాతానికి పైగా తగ్గించుకున్నట్టు సమాచారం. పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఒకప్పటి చిరంజీవి నటించిన ఒక సూపర్ హిట్ సినిమా లైన్‌ను తీసుకొని ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు త్రివిక్రమ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa