ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ తర్వాత సినిమా కోసం స్కెచ్ మాములుగా లేదుగా..!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jun 28, 2020, 04:04 PM

నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. భీష్మ హిట్ తో జోష్ కనబరుస్తున్న నితిన్ రంగ్ దే పాటుగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు .ఇక ఈ రెండు సినిమాల తర్వాత కృష్ణ చైతన్య కాంబినేషన్ లో పవర్ పేట సినిమా చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నితిన్ 3 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. బాహుబలి తర్వాత రెండు భాగాలుగా వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ డిజాస్టర్ గా మిలిగింది. ఇక ఇప్పుడు పవర్ పేట సినిమా కూడా అలానే రెండు పార్టులుగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది.అంతేకాదు ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమా కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయట. పిరియాడికల్ మూవీగా తెరకెక్కే ఈ సినిమాలో 1960 నుండి 2020 వరకు కథ నడుస్తుందట. ఈ పిరియడ్ గ్యాప్ లో మూడు డిఫరెంట్ రోల్స్ లో నితిన్ కనిపిస్తాడని తెలుస్తుంది. ఎప్పుడు లవర్ బోయ్ గా ఫీల్ గుడ్ మూవీస్, లవ్ స్టోరీస్ చేసిన నితిన్ ఈసారి సరికొత్త ప్రయోగాన్ని చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa