ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారుని తనవైపు తిప్పుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్ . తన ఘాటు అందాలతో కుర్రకారు మతి చెడగొట్టిన ఈ పంజాబీ బ్యూటీ వరుసగా ఆఫర్లు అందుకుంటుంది. అయితే ఇప్పుడు పాయల్ కి మరో ఛాన్స్ వచ్చిందని ఫిలిం నగర్ టాక్. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతం లో వచ్చిన ఇండియా సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో కమల్ కు జంటగా రకుల్ ప్రీత్ మరియు కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పాయల్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది అని సమాచారం. ఇక పాయల్ 'ఆర్ ఎక్స్ 100' తర్వాత ఈ మధ్య వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకిమామలో నటించింది.తెలుగు లో ఒక్కో ఛాన్సు దక్కించుకుంచుకుంటున్న ఈ హాట్ బ్యూటీకి మరో మంచి అవకాశం వచ్చిందని అంతా అంటున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa