తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో చనువుగా ఉండి పాపులారిటీని సంపాదించుకుంది పునర్నవి భూపాలం. హీరోయిన్‌గా కంటే బిగ్‌బాస్ 3 ద్వారా పునర్నవికి మంచి గుర్తింపు దక్కిందనే చెప్పాలి. బిగ్‌బాస్ వల్ల వచ్చిన నేమ్, ఫేమ్‌ను ఈ అమ్మడు తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందా? అంటే అవుననే సమాధానం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే పునర్నవి తెలుగు ఓటీటీ ఆహా రూపొందించబోయే ఓ వెబ్ సిరీస్‌లో నటించనుందంటూ టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa