మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150వ చిత్రంలో రత్తాలు అనే సాంగ్‌తో దుమ్ము రేపిన ఐటం బాంబ్ రాయ్ లక్ష్మీ. సీనియర్ హీరోలతో పాటు కుర్ర స్టార్స్‌తోను కాలు కదుపుతున్న ఈ అమ్మడికి ప్రస్తుతం సరైన ఆఫర్స్ రావడం లేదు. దీంతో తన ఫిజిక్‌పై దృష్టి పెట్టింది. లాక్‌డౌన్ సమయంలో వర్కవుట్స్ చేస్తూ సరైన డైట్ పాటిస్తూ జీరో సైజ్‌కి మారింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా, నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
రాయ్ లక్ష్మీ ఆ మధ్య ప్రధాన పాత్రలో ఓ సినిమా చేసినప్పటికీ , ఆ సినిమా మంచి విజయం సాధించలేకపోయింది. దీంతో ఐటెం సాంగ్స్‌కే పరిమితమవుతుంది. బాలీవుడ్ లో `ఆఫీసర్ అర్జున్ సింగ్- ఐపీఎస్ బ్యాచ్ 2000` అనే చిత్రంలో ఐటెమ్ నంబర్ లో ఆడిపాడుతోంది. అలాగే ఝాన్సీ, సిండ్రెల్లా, ఆనంద భైరవి అనే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa