సాయిపల్లవి సెలెక్టివ్ పాత్రలు ఎంచుకుంటూ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంత చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో ఎంచుకునే పాత్రలు, తన అప్పీయరెన్స్ కూడా అంతే సంప్రదాయబద్ధంగా ఉంటాయి. ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ ఆమె గ్లామర్ ఒలకబోయలేదు. హద్దులు దాటి నటించలేదు కథానాయిక సాయిపల్లవి మంచి డ్యాన్సర్ అన్న విషయం మనకు తెలుసు. అయితే, తనలోని డ్యాన్సర్ ని పూర్తిగా బయటకుతెచ్చే పాత్రలేవీ తనకు రావడం లేదని ఈ చిన్నది వాపోతోంది. అందుకే, పూర్తి డ్యాన్స్ ప్రధానమైన పాత్రతో సాగే సినిమా కోసం ఎదురుచూస్తోందట. అటువంటి ఆఫర్ ఏ భాష నుంచి వచ్చినా చేయడానికి ఆమె సిద్ధంగా వుందట. మరి ఆమె కల నెరవేరుతుందేమో చూడాలి!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa