అమ్మ సెంటిమెంట్ కథాంశంగా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన ‘బిచ్చగాడు’ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. విజయ్ ఆంటోనీకి తెలుగు ప్రేక్షకుల్లోనూ బిచ్చగాడు సినిమా మంచి క్రేజ్ సంపాదించి పెట్టిన నేపథ్యంలో తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా సీక్వెల్‌ను తీస్తున్నారు.బిచ్చగాడు హిట్ తర్వాత విజయ్ ఆంటోనీ సినిమాలు ఆ స్థాయిలో హిట్ కాలేదు. ఇప్పుడు మరో బిచ్చగాడిని పరిచయం చేస్తున్నానంటున్నాడు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ సినిమాకి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు-2’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన తమిళ, తెలుగు పోస్టర్‌లను ఆ సినిమా బృందం విడుదల చేసింది.
ఈ రోజు విజయ్ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా దీన్ని విడుదల చేస్తున్నట్లు ఆ సినీ బృందం తెలిపింది. విజయ్ ఆంటోనియే నిర్మాతగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా తమిళంలో ‘పిచ్చైకారన్-2’గా పేరు పెట్టారు. ప్రియా కృష్ణస్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాను 2021లో విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa