గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)పై భోజ్‌పురి సూపర్‌స్టార్ దినేష్ లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా రూపొందించిన హోలీ సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. జీఎస్టీకి తోడుగా వరకట్నం గురించి కూడా ఈ సాంగ్‌లో ప్రస్తావించారు. ఈ రెండింటిపై బీహార్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. దీంతో ఈ రెండింటినీ హైలైట్ చేస్తూ దినేష్ తీసిన ఈ సాంగ్ సూపర్‌హిట్ అయింది. త్వరలోనే హోలీ వస్తుండటంతో ఈ రెండు సమస్యలను దానికి లింకు పెట్టి వీడియో రూపొందించారు. దినేష్ లాలే ఈ సాంగ్‌ను పాడగా.. జీటీవీ ఫేమస్ సీరియల్స్ సాత్ ఫేరె, మాయ్కాల్లో నటించిన ఆమ్రపాలి దూబే ఈ సాంగ్‌లో నటించింది. ఫిబ్రవరి 15న దీనిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా.. నాలుగు రోజుల్లోనే 32 లక్షల వ్యూస్ రావడం విశేషం.