స్టార్ హీరోయిన్ సమంత తన డీపీని మార్చింది. గత ఏడాది ప్రముఖ ఫొటోగ్రాఫర్ జి.వెంకటరామన్ ది గ్రేట్ పెయింటర్ రవివర్మ చిత్రాలని పునః సృష్టించే క్రమంలో క్రేజీ తారలపై ఓ ఫొటో షూట్ ని నిర్వహించిన సంగతి విధితమే. ఈ ఫొటో షూట్ లో సమంతతో పాటు శృతిహాసన్ .. ఖుష్బూ.. నదియ.. సుహాసిని.. ఐశ్వర్యారాజేష్.. లక్ష్మీ మంచు రవివర్మ పేయింట్స్ కి తగ్గట్టుగా ఫొటోలకి పోజులిచ్చారు. దీనికి సంంధించిన ఫోటోని తన డీపీగా పెట్టుకున్న సామ్ 9 నెలల విరామం తరువాత మార్చేసింది. ఆ ఫోటోలో వింటేజ్ లుక్ లో గ్రామీణ యువతిగా కనిపించిన సామ్ మరింత గ్లామరస్ గా మోడ్రన్ యువతిగా కనిపించే ఫొటోని డీపీగా మార్చేసింది. ఈ సరికొత్త మోడ్రన్ లుక్ కి ఆ డ్రెస్ కి ఫ్యాన్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa