విక్టరీ వెంకటేష్ ఇటీవల 'వెంకీమామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం 'అసురన్' రీమేక్ 'నారప్ప' సినిమాలో నటిస్తున్నాడు వెంకీ. ఈ సినిమా 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత వెంకటేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమా వెంకీ కెరియర్ లో 75వ సినిమాదాంతో రిస్క్ తీసుకోకుండా .. తనకు ఎఫ్ 2 తో హిట్ ఇచ్చిన అనీల్ రావిపూడితోనే ఎఫ్ 3 చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ వచ్చే ఏడాది సమ్మర్ నుండి కొత్త సినిమాలో నటిస్తాడనే వార్తలు వస్తున్నాయి. వేంకటేశ తో సినిమా చేయడానికి ఇప్పటికే పలువురు దర్శకులు లైన్ లో ఉన్నారు త్రివిక్రమ్ తో కూడా వెంకీ ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇక తమిళ దర్శకుడు మిలింద్ రావ్ కూడా ఆ జాబితాలో చేరాడని సమాచారం. మిలింద్ రావ్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో వెంకటేష్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట . మిలింద్ రావ్ ప్రస్తుం వెంకీ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అతి త్వరలోనే మరోసారి వెంకీని కలిసి పూర్తి స్క్రిప్ట్ ను వినిపించే అవకాశం ఉందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa