ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్‌ స్టార్‌ కృష్ణ సకుటుంబ సమేతంగా సందడి..

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 08, 2020, 08:52 AM

సూపర్‌ స్టార్‌ కృష్ణ చిన్న కూతురు, హీరో సుధీర్‌ బాబు భార్య ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుకను ఘట్టమనేని ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలెబ్రేట్‌ చేసింది. నాన్న కృష్ణ, బావలు జయదేవ్‌, సంజయ్‌ స్వరూప్‌, సుధీర్‌లతో కలిసి సందడిగా గడిపారు. ఈ వేడుకల్లో సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయన సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరిరావు, మహేశ్‌, నమ్రత, సంజయ్‌ స్వరూప్‌, జయదేవ్‌, సుధీర్‌బాబు పాల్గొన్నారు. సోదరీమణులు, బావలు, నాన్న కృ​ష్ణతో కలిసి మహేశ్‌ బాబు-నమ్రత జంట భోజనం చేశారు. ఈ ఫోటోలను సుధీర్‌ బాబు ట్వీటర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘ ఈ రోజు నా లైఫ్‌ పుట్టింది. హ్యాపీ బర్త్‌డే ప్రియా’అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa