దర్శకుడు మారుతీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా పలువురు ప్ర్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విటర్ ద్వారా మారుతికి బర్త్ డే విషెస్ తెలియజేశాడు. "నా చిరకాల మిత్రులలో ఒకడు, నా శ్రేయోభిలాషి, డైరెక్టర్ మారుతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు" అని బన్నీ ట్వీట్ చేశాడు. కాగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బన్నీ వాసుతో పరిచయం ఇతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. 'ఆర్య' సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత 'ఏ ఫిల్మ్ బై అరవింద్', 'ప్రేమిస్తే' సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాడు. దానికి ముందు పోస్టర్ డిజైనింగ్స్, మల్టీమీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మారుతి "ఈ రోజుల్లో" అంటూ చిన్న సినిమాతో సంచలనం సృష్టించాడు. తర్వాత "బస్ స్టాప్", ఆ తర్వాత "ప్రేమకథా చిత్రం"తో అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మారుతి. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. "భలేభలే మగాడివోయ్" సినిమాతో మారుతి రేంజ్ మారిపోయింది. "బాబు బంగారం", "కొత్తజంట", "మహానుభావుడు", "శైలజ రెడ్డి అల్లుడు", "ప్రతి రోజు పండగే" వంటి సినిమాలు తెరకెక్కించాడు. త్వరలో మహానుభావుడు సినిమాను హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. మొత్తానికి ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటూ దూసుకెళ్తున్నాడు మారుతి.
Many many happy returns of the day to one of my oldest friend , well wisher & director Maruthi @directormaruthi . pic.twitter.com/eOV5RULtnk
— Allu Arjun (@alluarjun) October 8, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa