ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్‌ వెళ్లకముందు జ్వరంతో బాధపడుతున్నారు

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 10:18 AM

అలనాటి నటి శ్రీదేవి గత శనివారం దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. మేనల్లుడు మోహిత్‌ మార్వా వివాహం నిమిత్తం శ్రీదేవి తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఉన్న హోటల్‌లోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోయి మరణించారు.అయితే శ్రీదేవి దుబాయ్‌కి వెళ్లకముందు జ్వరంతో బాధపడుతున్నారని ఆమె చిన్ననాటి స్నేహితురాలు, సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి వెల్లడించారు. మంగళవారం శ్రీదేవి భౌతికకాయాన్ని దుబాయ్‌ నుంచి ముంబయికి తీసుకువచ్చారు. ఆఖరిసారిగా తన స్నేహితురాలిని చూసుకునేందుకు వచ్చిన పింకీ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


‘దుబాయ్‌కి వెళ్లకముందు శ్రీదేవి నాకు ఫోన్‌ చేసింది. అప్పటికే తాను జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పింది. యాంటీబయోటిక్స్‌ వాడుతోంది. దుబాయ్‌కి బయలుదేరడానికి ముందు అలసిపోయినట్లు ఉంది. ఇంత జ్వరంలో వెళ్లడం ఎందుకు అని అడిగాను. పెళ్లికి తప్పకుండా వెళ్లాల్సిందేనని పట్టుబట్టింది. ఆఖరికి మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. నా సోదరిని కోల్పోయాను. శ్రీదేవి మరణంపై తప్పుడు ప్రచారం చేయడం చూసి హృదయం కలచివేసింది. లైపోసక్షన్‌ చేయించుకుందని, సర్జరీలు చేయించుకుందని ఏవేవో రాసేస్తున్నారు. ఆమె చేసిన మంచి సినిమాల గురించి ఎందుకు మాట్లాడరు? ఓ మనిషి చనిపోయినప్పుడు వారి గురించి ఇంత తప్పుగా ఎలా ఆలోచిస్తారు? శ్రీదేవి, బోనీ మధ్య కూడా ఎలాంటి మనస్పర్థలు లేవు.’ అని చెప్తూ బాధపడ్డారు పింకీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa