ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ వేళ చూశానో.. అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 10:45 AM

అర్జున్ రెడ్డి చిత్రంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం ప‌లుప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఏ మంత్రం వేసావే అనే రొమాంటిక్ చిత్రంతో మార్చి 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, మేక‌ర్స్ సినిమాకి సంబంధించి తొలిసాంగ్ విడుద‌ల చేశారు. ఏ వేళ చూశానో కాని అంటూ సాగే పాట సంగీత ప్రియుల‌ని అల‌రిస్తుంది. అబ్ధుస్ స‌మంద్ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా విడుద‌లైన పాట‌కి అరుణ్ వేమూరి లిరిక్స్ అందించ‌గా, యాజిన్ నిజ‌ర్ పాట పాడారు. శ్రీధ‌ర్ మ‌ర్రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం గోలీసోడా ఫిలింస్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై రూపొందుతుంది. శివాని సింగ్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ రాహుల్ సంకృతియ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇటీవ‌ల‌ ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ రిలీజ్ చేశారు మేక‌ర్స్ . దుమ్ము లేపుకుంటూ వెళుతున్న కారు ఫోటోని షేర్ చేస్తూ ఫ‌స్ట్ లుక్ త్వ‌ర‌లోనే రానుంద‌ని ప్ర‌క‌టించారు. టాక్సీవాలా అనే టైటిల్‌తో ఈ మూవీ ప్ర‌చారం జ‌రుపుకుంటుండ‌గా, జీఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యూవీ క్రియేష‌న్స్ బేన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాక్సీ డ్రైవ‌ర్ చుట్టూ ఈ మూవీ క‌థ తిరుగుతుంద‌ని తెలుస్తుంది. చిత్రంలో షార్ట్‌ ఫిలింస్‌ బ్యూటీ ప్రియాంక జవల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ చిత్రంలో టాక్సీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa