యంగ్ హీరో అడవి శేష్ ప్రస్తుతం "మేజర్" సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి 'గూఢచారి' ఫేం శశి కిరణ టిక్కా దర్శకత్వం వహిస్తుండగా, సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శోభితా ధూళిపాళ్ల ఈ సినిమాలో కథానాయిక. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రాగా.. తాజాగా రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా వదిలింది చిత్ర బృందం. ఈ మూవీని 2021, జూలై 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆదరిస్తోందో చూడాలి. కాగా.. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa