ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంతకన్నా గొప్ప స్క్రిప్ట్‌ ఇవ్వగలరా?: వర్మ

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 02:36 PM

 వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ బాలీవుడ్‌ రచయితలకు ఓ సవాల్‌ విసిరారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు మించిన స్క్రిప్ట్‌ అందిచగలరా అని ప్రశ్నించారు.ఓ వైపు ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం, ఆయన కొడుకు కార్తీల సీబీఐ విచారణ, కాంగ్రెస్‌ అవినీతి, బీజేపీ ప్రతీకారం, మనీ లాండరింగ్‌, నీరవ్‌ మోదీ బ్యాంకుల కుంభకోణం, ఇంద్రాణి ముఖర్జీ హత్య కేసులను ప్రస్తావిస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. వీటన్నిటి కన్నా బలమైన స్క్రిప్ట్‌తో గొప్ప బాలీవుడ్‌ రచయితలు ముందుకు రాగలారా? నాకు సందేహమే అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. వర్మ చేసిన ఈ సెటైరిక్‌ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa