నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో తళుక్కున మెరుస్తుంది. తాజాగా`చావు కబురు చల్లగా` సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించడానికి అనసూయ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 3 నిమిషాల నిడివి ఉండే ఈ సాంగ్ కోసం అనసూయ రూ.20 లక్షలు డిమాండ్ చేయగా, చిత్ర బృందం వెంటనే ఓకే చెసినట్లు సమాచారం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సాంగ్ షూట్‌ను త్వరలోనే హైదరాబాద్ లో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కౌశిక్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇంతకుముందు సాయి తేజ్ నటించిన విన్నర్ సినిమాలోనూ అనసూయ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa