మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేస్తున్న 'ఖిలాడి' సినిమాలో ప్రముఖ నటుడు అర్జున్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా చిత్రబృందం తాజాగా ప్రకటించింది. 'ఖిలాడి' సెట్‌లో తీసుకున్న ఫొటోను అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే అర్జున్ కూడా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, సత్యనారాయణ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa