బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న చిత్రం వకీల్ సాబ్. శ్రీరామ్ వేణు దర్శకుడు. ఈ మూవీలో హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించాడు. ఈ చిత్ర విడుదల తేదీని శనివారం అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం ఏప్రియల్ 9వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోన్నట్లుగా చెబుతూ.. చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. వేసవికి ట్రీట్ అన్నట్లుగా చిత్రయూనిట్ విడుదల తేదీ ప్రకటించడంతో.. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేశారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర తారాగణంగా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa