ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నాడట. మలయాళం హిట్ సినిమా 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వీవీ వినాయక్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగులో కూడా ఆయన ఇటీవల పాల్గొన్నట్టు, గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన షూటింగులో ఆయనపై చిత్రీకరణ జరిగినట్టు సమాచారం. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేను సమకూర్చడమే కాకుండా, మాటలు కూడా రాస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa