వరుస సక్సెస్ లతో లవర్ బాయ్ అనిపించుకున్న రాజ్ తరుణ్ కి, ఈ మధ్య సరైన హిట్ లేదు. దాంతో ఆయన తన తాజా చిత్రమైన 'రాజుగాడు'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సంజనా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, షూటింగు పార్టును పూర్తి చేసుకుని .. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.రాజ్ తరుణ్ జోడీగా అమైరా దస్తూర్ నటించింది. యూత్ కి నచ్చే కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా నుంచి, 'ఉగాది' రోజైన మార్చి 18న టీజర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa