సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు ఒకరు. తన సినిమాల అప్‌డేట్స్ లేదంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ నెటిజన్స్‌ను అలరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మహేష్ ఫాలోవర్స్ సంఖ్య అధికంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం మహేష్ కోటీ 14 లక్షల ఫాలోవర్స్ ట్విట్టర్ లో కలిగి ఉండగా, మరే టాలీవుడ్ హీరో ఈ ఫీట్‌ని బీట్ చేయలేదు. అయితే ఇదే వేదికపై మహేష్ మరో రికార్డ్ సాధించాడు. మహేష్ చేసిన ట్వీట్స్‌కి 100 కె లైక్స్ 24 సార్లు రాగా, ఆయనకు అగ్రస్థానం దక్కింది. తర్వాతి స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ " 6 " ఉన్నారు. అనంతరం రానా దగ్గుబాటి" 3 " రికార్డుకెక్కారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ " 2 సార్లు " నితిన్ "2 సార్లు ".. అల్లు అర్జున్ " 2 సార్లు ".. రామ్ చరణ్ .. నాని ఒక్కసారి మాత్రమే సాధించారు. కాగా, మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa