పవన్ కళ్యాణ్ వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన పింక్ సినిమా తెలుగు రీమేక్ వకీల్ సాబ్ అనే సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్‌కు జోడిగా శృతి హాసన్ నటించింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తొలిసారి లాయర్ పాత్రలో కనిపించారు. అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను ఖరారు చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తోంది చిత్రబృందం. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. కరోనా పరిస్థితులు చక్కబడగానే తిరిగి షూటింగు మొదలవుతుందని అంటున్నారు.
ఇక ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ విడుదలకానుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, సెప్టెంబర్ 2న టీజర్‌ను రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. చారిత్రక నేపథ్యంలో పవన్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం అంటే 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa