ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేయనున్న యాంకర్ ప్రదీప్ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sun, May 23, 2021, 01:20 PM

బుల్లితెరపై యాంకర్‌గా సందడి చేస్తూ ప్రేక్షకులకు ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా మారారు. మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. గత ఏడాది విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఏడాది మొదట్లో విడుదల చేశారు. ఇందులో అమృత అయ్యర్,పోసాని కృష్ణ మురళి,వైవా హర్ష,శుభలేఖ సుధాకర్,హేమ ముఖ్య పాత్రలు పోషించారు.సినిమా రిలీజ్‌కు ముందు 'నీలి.. నీలి.. ఆకాశం' పాట విడుదల చేయగా, దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట సినిమాపై భారీ అంచనాలు పెంచింది. పాట అంత బాగుంటుంది సినిమా అని '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' థియేటర్స్‌కి రప్పించాడు యాంకర్ ప్రదీప్. జనవరి 29న చిత్రం థియేటర్స్ లో విడుదల చేయగా, తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa