ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చరణ్ సరసన మరో మారు మెరవనున్న అలియా

cinema |  Suryaa Desk  | Published : Sun, May 23, 2021, 02:07 PM

ఆర్ఆర్ఆర్  ’రణం రౌద్రం రుధిరం’  కోసం మెగాఫ్యాన్స్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో చరణ్ అల్లూరిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రం పాన్ఇండియా లెవెల్ లో భారీగా తెరకెక్కబోతున్నది. శంకర్ ఇండియన్ -2 తర్వాత ఈ సినిమా ప్రారంభిస్తాడని టాక్. అయితే ప్రస్తుతం  ఇండియన్- 2 పలు వివాదాల్లో చిక్కుకున్నది. నిర్మాణ సంస్థకు దర్శకుడు శంకర్ కు మధ్య వివాదం నెలకొన్నది. ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఆ లోపు శంకర్.. చరణ్ తో సినిమా తీస్తాడని సమాచారం. ఇండియన్ -2 నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుతం కోర్టుకు వెళ్లింది. ముందుగా తమ సినిమా తెరకెక్కించాలని సదరు సంస్థ కోరుతున్నది. అయితే శంకర్ మాత్రం చరణ్తో సినిమా చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. దీంతో హీరోయిన్ కోసం ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ ను సంప్రదించారు. అయితే చివరకు అలియానే హీరోయిన్ గా కన్ఫార్మ్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరవైపు శంకర్ తో మెగా పవర్స్టార్ చరణ్ సినిమా అనగానే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇటు తెలుగు అటు తమిళంలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa