పవన్కళ్యాణ్ ఈ సినిమాలో వజ్రాల దొంగ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన సరసన నాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది.
ఈ సినిమా కోసం ఆ కాలంనాటి నిర్మాణ రీతులను పోలిన భారీ సెట్లు వేస్తున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. కరోనా పరిస్థితులు చక్కబడగానే తిరిగి షూటింగు మొదలవుతుందని అంటున్నారు.ఇక ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, సెప్టెంబర్ 2వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు ఉన్నారట. అందువలన ఈ మధ్యలో టీజర్ వచ్చే అవకాశం లేదనే అంటున్నారు. అప్పటివరకూ వివిధ రకాల పోస్టర్స్ తోనే అభిమానులను సంతృప్తి పరుస్తూ వెళతారని చెప్పుకుంటున్నారు. చారిత్రక నేపథ్యంలో పవన్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa