మహేశ్ బాబు కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాను, హారిక అండ్ హాసిని బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రమే అయినా, తెలుగులో మాత్రమే విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మించనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తెలుగుతో పాటుగా ఇతర భాషల్లోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.ఈ సినిమాకి 'పార్థు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉందట. ఒక కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa