మన సౌత్ సినిమాల్లో తక్కువ సమయంలో పాతిక మిలియన్ ల వ్యూస్ దక్కించుకున్న టీజర్ లను ఇప్పుడు చూద్దాం.రెండు మూడు సంవత్సరాల ముందు వరకు యూట్యూబ్ లో మిలియన్ రెండు మిలియన్ ల వ్యూస్ అంటే అదో పెద్ద రికార్డు. అలాంటిది ఇప్పుడు వందల మిలియన్ ల వ్యూస్ ను అలవోకగా సాధిస్తున్నారు. అలా టీజర్ లతో పాతిక మిలియన్ ల వ్యూస్ ను తక్కువ సమయంలో దక్కించుకున్న సినిమాల్లో మొదటగా కేజీఎఫ్ 2 నిలిచింది. కన్నడ మూవీ అయిన కేజీఎఫ్ 2 కేవలం 15 గంటల్లో పాతిక మిలయన్ ల వ్యూస్ ను దక్కించుకుని నెం.1 గా నిలిచింది. రెండవ స్థానంలో అల్లు అర్జున్ సుకుమార్ ల పుష్ప సినిమా టీజర్ 26 గంటల్లో పాతిక మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది.తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ టీజర్ పాతిక మిలియన్ ల వ్యూస్ ను కేవలం 48 గంటల్లో దక్కించుకుంది. ఇక బాలయ్య బోయపాటిల కాంబోలో రూపొందుతున్న అఖండ సినిమా టీజర్ పాతిక మిలియన్ ల వ్యూస్ ను 5 రోజుల 19 గంటల్లో దక్కించుకుంది. ఇక టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి వచ్చిన ఎన్టీఆర్ ఇంట్రో వీడియో 6 రోజుల 12 గంటల్లో పాతిక మిలియన్ ల వ్యూస్ ను పొందింది. ఈ రికార్డులు వచ్చే ఏడాదికి తారు మారు అయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa