ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరకాసురన్ సినిమా ఎట్టకేలకు రిలీజ్ ఓటీటీలోనే!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 02, 2021, 11:56 AM

 తమిళ యువ దర్శకులలో కార్తీక్ నరేన్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన తొలి చిత్రంగా వచ్చిన 'ధృవంగల్ పతినారు' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 2016లో వచ్చిన ఈ సినిమా, తెలుగులో '16' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూట్యూబ్ లో ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేవారు ఉన్నారు. బలమైన స్క్రీన్ ప్లేతో నడిచే ఈ సినిమా, చివరివరకూ సస్పెన్స్ తో  సాగుతుంది. ఈ సినిమా చూసే కార్తీక్ నరేన్ దర్శకత్వంలో గౌతమ్ మీనన్ 'నరకాసురన్' సినిమాను నిర్మించాడు.ఈ చిత్రంలో మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన వాళ్లే ముఖ్య పాత్రలు పోషించారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తోె పాటు శ్రియ, అరవింద్ స్వామి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా సందీప్ కిషన్ నటించిన మరో తమిళ చిత్రం కూడా ఓటీటీలోనే విడుదల కానుండటం విశేషం. ఆ సినిమా పేరు.. కసాడ తపర. ఇదొక ఆంథాలజీ ఫిలిం. సందీప్‌తో పాటు హరీష్ కళ్యాణ్, రెజీనా కసాండ్రా, దర్శకుడు వెంకట్ ప్రభు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సోనీ లైవ్‌లోనే జులైలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa