ఉయ్యాలా జంపాల సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన అమ్మడు పునర్నవి భూపాలం. సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చినప్పటికీ చెప్పుకో దగ్గ పేరు మాత్రం రాలేదు. ఇటీవల వచ్చిన బిగ్ బాస్ సీజన్ 3 లో హౌస్ లో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఒక్కసారిగా ఫేమస్ అయిపొయింది. దానికి కారణం లేకపోలేదు. హౌస్ లో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ తో ఉన్న కెమిస్ట్రీయే కారణమనే చెప్పాలి. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగటంతో వీరి మధ్య ఎదో ఉందని సోషల్ మీడియా కోడైకూసింది.ఇది ఇలా ఉండగా.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెడిటేషన్ చేస్తున్న ఉన్న ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. పునర్నవి ఇంత బోల్డ్ గా ఎప్పుడూ కనిపించకపోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa