నంది క్రియేషన్స్ బ్యానర్ పై కె మొహమ్మెద్ రఫీ నిర్మిస్తున్న చిత్రం బంగారి బాలరాజు. ’రైల్వే ట్రాక్’ అనే ఫిలిం తో ఉత్తమ మొదటి చిత్ర దర్శకుడు గా నంది అవార్డు ను సొంతం చేసుకున్న కోటెంద్ర దుద్యాల ఈ మూవీకు దర్శకుడు, హీరో, హీరోయిన్స్ కొత్తగా పరిచయం అవుతున్న ఈ చిత్రం లో ప్రముఖ తారాగణం నటించిన ఈ నూతన చిత్రం బుధవారం రామానాయుడు స్టూడియో లో అతిథులుగా విచ్చేసిన దర్శకుడు సాగర్ ఈ చిత్రానికి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, క్లాప్ ను హీరో నాగ అశ్విన్ ఇవ్వగా, సింధురపువ్వు కౄఎష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించి ఈ నూతన చిత్ర ప్రారంబోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక ఈ చిత్ర కాన్సెప్ట్ విషయానికి వస్తే సశాబ్దాలు మారినా, శతాబ్దాలు మారినా ప్రేమ మారదు, ప్రేమికులు మాత్రమే మారుతుంటారు, రోమియో - జూలియట్, సలీం- అనార్కలి, లైలా- మజ్ను, దేవదాస్- పార్వతి ఇలా అందరూ ప్రేమను త్యాగం చేసుకొని చరిత్రలో నిలిచిపోయిన వారే. ఇప్పుడు ఈ బంగారి బాలరాజు కూడా వారిలా తమ ప్రేమను త్యాగం చేసుకొని చరిత్రలో నిలిచిపోతారా ? లేక ప్రేమను గెలిపించుకొని చరిత్ర సౄఎష్టిస్తారా అన్నదే ఈ చిత్ర కాతాంశం అని దర్శక నిర్మాతలు తెలిపారు.ఈ నూతన చిత్రానికి నటీ నటులు రోహిణి, అజయ్ ఘోష్, అప్పారావు, లేఖన, ఆర్ పీ, మహేంద్ర నాథ్ లు కాగా సాంకేతిక విభాగం కథ- మాటలు- స్క్రీన్ ప్లే - దర్శకత్వం కోటెంద్ర దుద్యాల, నిర్మాత: కె మొహమ్మెద్ రఫీ, సంగీతం: చిన్ని కౄఎష్ణ - చిట్టి బాబు రెడ్డిపోగు, కెమెరా: బాబు జీ ఎల్, ఆర్ట్: కౄఎష్ణ మాయ, ఎడిటర్: సాయి బాబు- హరి, కో డైరెక్టర్: హేమంత్ కుమార్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa