టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు క్రేజ్ ఏ రేంజిలో ఉందో మరోసారి రుజువైంది. ఆయన నటిస్తున్న 'స్పైడర్' మూవీ ఎప్పుడొస్తుందా అని ఆకలితో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆ సినిమాకు సంబంధించి ఏది రిలీజైనా నమిలేస్తున్నారు.సినిమా ప్రమోషన్లో భాగంగా 'బూమ్ బూమ్' అనే సాంగ్ బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఈ సాంగుకు ఊహించని స్పందన వచ్చింది. కొన్ని గంటల్లోనే మిలియన్ మార్క్ రీచ్ అయింది. 24 గంటలు గడిచేలోపు రికార్డ్ వ్యూస్ ఖాయం అంటున్నారు విశ్లేషకులు అంచనాలు పెంచిన సాంగ్ ‘బూమ్ బూమ్' సాంగ్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ చిత్రంలో మహేష్ బాబును దర్శకుడు మురుగదాస్ సరికొత్తగా ప్రజంట్ చేశాడు. అదిరిపోయే యాక్షన్ సీన్స్, ఊహకందని ట్విటస్టులతో సినిమా ఉండబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa