'జబర్దస్త్' కామెడీ షో పాప్యులర్ కావడంతో ఈ కార్యక్రమాన్ని నడిపించే యాంకర్ గా రష్మికి .. ఒక టీమ్ లీడర్ గా సుధీర్ కి మంచి పేరు వచ్చింది. కొన్ని స్కిట్స్ కారణంగా ఈ ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ వార్తలు కూడా షికారు చేశాయి. అయితే తమ మధ్య అలాంటిదేం లేదంటూ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు కూడా.
తాజాగా ఒక షో కోసం సుధీర్ కి .. రష్మికి పెళ్లి జరిగినట్టుగా చూపించేశారు. పెళ్లి తంతు సహజంగా అనిపించడంతో .. నిజంగానే వీళ్లు పెళ్లి చేసుకున్నారా? అనే సందేహం అభిమానుల్లో ఎక్కువైపోతోంది. ఈ నేపథ్యంలో " మీరు నిజంగానే సుధీర్ ని పెళ్లి చేసుకున్నారా .. లేదా? .. ఈ విషయంలో మాకు క్లారిటీ కావాలి" అనే ప్రశ్నను ఒక అభిమాని ట్విట్టర్లో రష్మిని అడిగేశాడు. దాంతో "క్రమం తప్పకుండా ఈ షోను చివరి వరకూ చూడండి .. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది" అంటూ రష్మి గడుసుగా సమాధానమిచ్చింది
Watch the show till the end and get your clarity https://t.co/ktD33fvkBG
— rashmi gautam (@rashmigautam27) March 20, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa