గ్లామర్ ను ఒలకపోయడానికి కాదే చోటూ అనర్హం.. అన్నట్టుగా ఉంది హీరోయిన్ల పరిస్థితి. తమ అందాల ప్రదర్శనకు బాత్ టబ్బులను వేదికగా చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోనే చేరింది.. ప్రణీతా సుభాష్. పలు తెలుగు సినిమాల్లో నటించినా.. ఎక్కువగా సెకెండ్ హీరోయిన్ పాత్రలే వచ్చాయి ఈ కన్నడ భామకు.చోటా హీరోల సరసన నటించబట్టి చాలా కాలమే అయ్యింది. అయితే ప్రణీతకు పెద్ద హీరోల సరసన అవకాశాలు కాస్త లేటుగా వచ్చాయి. అయితే అవన్నీ సెకెండ్ హీరోయిన్ పాత్రలే. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి హీరోల సినిమాల్లో ద్వితీయ ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ పాత్రలో నటించింది ప్రణీత. వాటితో కొంత గుర్తింపు దక్కింది కానీ.. స్టార్ స్టేటస్ రాలేదు.
ఈ నేపథ్యంలో ప్రణీతకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఈమె సోషల్ మీడియా ద్వారా తను ఉన్నాననే సంకేతాలు ఇస్తోంది. ఇన్ స్టాగ్రమ్ లో గ్లామరస్ ఫొటోలు పోస్టు చేస్తూ ఉంది ఈ హీరోయిన్. అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి. బాత్ టబ్బులో అందాల ప్రదర్శనతో ఆకట్టుకునే యత్నం చేస్తోంది ప్రణీత. మరి దీంతో అవకాశాలు ఏమైనా వస్తాయేమో చూడాలి!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa