ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంగ‌నా చిత్రంలో అమైరా ద‌స్తూర్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 20, 2018, 05:05 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘మెంటల్ హై క్యా’. ఈ చిత్రంతో నేషనల్ అవార్డు గ్రహీత ప్రకాశ్‌ కోవెలమూడి బాలీవుడ్‌లోకి దర్శకుడిగా  అడుగుపెడుతున్నారు. హాస్య ప్ర‌ధానంగా సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌కు కథ, మాటల‌ను ప్రకాశ్‌ సతీమణి కనిక థిల్లాన్ అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలతో.. ఇప్ప‌టికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది ఈ చిత్రం. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావ్‌కు జంటగా అమైరా దస్తూర్ నటించనుందని సమాచారం. ఈ నేపథ్యంలో.. చిత్ర బృందం అమైరాను సంప్రదించినట్టు తెలుస్తోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa