మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన రెండవ సినిమా 'కొండపొలం'. తాజాగా ఈ మూవీ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ఫేస్ లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ఇందులో రకుల్ పూర్తి గ్రామీణ యువతిగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 8న గ్రాండ్‌గా థియోటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు. దీనికి ఎం.ఎం.కీరవాణి సింగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa