మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న లేటెస్ట్ చిత్రం సీటీమార్. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుకుంటూ వస్తోంది. ఇక ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమాను దర్శక నిర్మాతలు సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అందులో భాగంగా స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్'ను రామ్ పోతినేని తన సోషల్ మీడియా వేదికగా విడుదలచేశారు. ట్రైలర్ చూస్తుంటే.. స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న మాస్ యాక్షన్ ఫిల్మ్‌లా కనిపిస్తోంది. తమన్నా సొంతంగా డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. మాస్ డైలాగులు...లతో ఆకట్టకుంటోంది. ఇక ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా 'సీటీమార్' ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న కొందరి యువతులను ఎలా ఛాంపీయన్స్‌గా మార్చారు.. దానికోసం ఎలాంటీ కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది కథగా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాట జ్వాలా రెడ్డికి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. ఇక గోపీచంద్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్‌ఫుల్ బ్యానర్స్ జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.
. @YoursGopichand & @tamannaahspeaks look Fantastic! A BIG Screen experience for sure! https://t.co/2OljVmP1QB
Good luck @IamSampathNandi@srinivasaaoffl @SS_Screens @DiganganaS @bhumikachawlat @actorrahman #Manisharma @adityamusic
— RAm POthineni (@ramsayz) August 31, 2021
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa