రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రం లో రవి తేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో డింపుల్ హాయాతీ, అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల పై చిత్ర యూనిట్ తాజాగా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 10 వ తేదీన ఇష్టం పూర్తి లిరికల్ సాంగ్ విడుదల కానుంది. అందుకు సంబంధించిన ప్రోమో రేపు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ చిత్రం లో రవితేజ డ్యుయల్ రోల్ చేస్తుండటం తో సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa