ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఫొటోలు లీక్‌ అయ్యాయి

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 07, 2021, 09:41 AM

నయనతార ప్రస్తుతం ఓ హిందీ చిత్రం షూటింగ్‌ కోసం పూనేలో ఉన్నారు. షారుఖ్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార నటిస్తున్న తొలి హిందీ చిత్రం ఇదే. ఈ సినిమాకు జవాన్‌ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ఇందులో షారుఖ్‌ ఖాన్‌, నయనతార పాల్గొన్న యాక్షన్‌ సన్నివేశానికి సంబంధించిన రెండు ఫొటోలు లీక్‌ అయి, సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.మూడేళ్ల నుంచీ షారుఖ్‌ ఖాన్‌ , అట్లీ ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఈ కాంబినేషన్‌ ఇప్పటికి సెట్‌ అయింది. హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేయడంతో ఈ ప్రాజెక్ట్‌కు క్రేజ్‌ మరింత పెరిగింది.



 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa